జల విలయంతో జంటనగరాలు అల్లాడిపోతుంటే ఉద్యానశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారని... ప్రజా సమస్యల పట్ల పట్టింపులేని ధోరణికి ఇదే తార్కాణమని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కీలక అంశాలను గాలికొదిలేసి... ఆస్తుల నమోదు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.
ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రికి పట్టింపులేదు: కోదండరాం - వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కోదండరాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వరదలతో జంటనగరాలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి ఉద్యానశాఖపై సమీక్ష నిర్వహించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.
ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రికి పట్టింపులేదు: కోదండరాం
ఉదయపు నడకకు వచ్చిన వారిని కోదండరాం కలుసుకున్నారు. ఓటు అభ్యర్థించడంతో పాటు ఎన్నికల్లో పేరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ నమోదు చాలా సులువన్న ఆయన... ఇందుకు గెజిటెడ్ సంతకం అవసరం లేదన్న తమ అభిప్రాయంతో ఎన్నికల సంఘం ఏకీభవించిందని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: వరద బాధితులను ఆదుకోవాలి : దాసోజు శ్రవణ్