తెజస అధ్యక్షుడు కోదండ రామ్ నల్గొండలో పర్యటించారు. బత్తాయి సాగుదారులకు సంఘీభావంగా క్లాక్ టవర్ వద్ద బత్తాయిలను అమ్మారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరామ్ సూచించారు.
''చెప్పిన పంటలే వేయాలని రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదు. పంటల కూర్పు పేరిట రైతు బంధు నిలిపివేసే అవకాశం ఉంది. నిర్దిష్ఠ పద్ధతులతో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలి. పత్తి వేసుకోవాలని రైతులను బలవంత పెట్టడం సరికాదు. బత్తాయికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు విరివిగా ప్రచారం చేయాలి.''