రైతుల పంటలకు ఎండిపోకుండా చివరి ఎకరానికి కూడా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభలో పాల్గొన్న గులాబీ బాస్... రెండోసారి అవకాశమిచ్చిన ప్రజలకు అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని భరోసానిచ్చారు. దేశంలో అన్నింటా ముందున్న రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, కాలువల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
ఫికర్ చేయకుండ్రి... మీ పంటలు ఎండనియ్యా...! - MEETING
"దేశంలో అన్నింటా మనమే ముందున్నాం. ఆర్థిక ప్రగతిలో... 24 గంటల కరెంటు విషయంలో మొదటి స్థానంలో ఉన్నాం. మీ కళ్ల ముందున్న సంక్షేమాభివృద్ధిని చూసే మళ్లీ ఆశీర్వదించారు. ఇక మీ పంటలు ఎండనియ్యా. అందరికీ నీళ్లిచ్చి పండించుకుందాం."--- కేసీఆర్
![ఫికర్ చేయకుండ్రి... మీ పంటలు ఎండనియ్యా...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2842516-653-193b35d7-ffdc-4c10-ad35-bd6adfeab68f.jpg)
నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటా...