దేశంలో గుణాత్మత మార్పుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టి మార్పులకు శ్రీకారం చుడతానన్నారు. తాను పార్టీ పెట్టేది అధికారం కోసం కాదని... దేశ భవిష్యత్ బాగుచేసేందుకేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. జూన్లో దేశం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుని రైతుల కష్టాలను సమూలంగా తీర్చేస్తానని గులాబీబాస్ ఆసక్తికర ప్రకటన చేశారు.
'జూన్లో దేశ ప్రజలు ఆశ్చర్యపోయే నిర్ణయం' - MEETING
"భాజపా, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే... రాష్ట్రాలకు అధికారం ఇవ్వరు. ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి వల్లే అది సాధ్యం. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ఎవరో ఒకరు పొలికేక పెట్టాలే. మీ ఆశీర్వాదంముంటే ఆ పొలికేకను నేనైతా"--- కేసీఆర్

రైతుల కష్టాలను సమూలంగా తీరుస్తా...
Last Updated : Mar 29, 2019, 8:21 PM IST