తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Election Campaign in Nalgonda District Today : ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు కేసీఆర్ పర్యటన.. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో సభలు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

KCR Election Campaign in Nalgonda District Today : : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారపర్వంలో ముందున్న బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొననున్నారు. ఆయా ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలు సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు.

Miryalaguda KCR Public Meeting Today
CM KCR Election Campaign in Nalgonda

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 9:52 AM IST

KCR Election Campaign in Nalgonda District Today ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు కేసీఆర్ పర్యటన

KCR Election Campaign in Nalgonda District Today :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్.. నేడు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తలు కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజుర్‌నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైదిరెడ్డి అన్నారు.

CM KCR NalgondaDistrict Tour Today : హుజూర్​నగర్ సభ అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvad Sabha)లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. మిర్యాలగూడలోని ఎన్​సీపీ క్యాంప్ గ్రౌండ్​లో జరిగేసభకు సుమారుగా 50 వేల మంది హాజరవుతారని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. సభకు హజరయ్యే నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

CM KCR Speech at Asifabad Public Meeting : ''ధరణి​'ని తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొండుల రాజ్యం'

"కేసీఆర్​ సభకు హుజూర్​నగర్ నలుమూలల నుంచి జనం తరలివస్తారు. వారందరూ కేసీఆర్​ మీటింగ్​​ వినడానికి, కేసీఆర్​ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభతో హుజూర్​నగర్ మొత్తం గులాబి మయం కాబోతుంది. ప్రజలందరూ వచ్చి కేసీఆర్ సభను జయపద్రం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను."- శానంపూడి సైదిరెడ్డి, బీఆర్​ఎస్​ అభ్యర్థి

CM KCR Speech at Medchal Public Meeting : "హైదరాబాద్​లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం"

Devarakonda KCR Public Meeting Today : హుజూర్​నగర్, మిర్యాలగూడ సభలు అనంతరం చివరిగా దేవరకొండ నియోజకవర్గంలోని శానంపూడిసైదిరెడ్డి, బీఆర్​ఎస్​ అభ్యర్థివర్గంలో నిర్వహించేప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌పాల్గొంటారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్(MLA Ravindra naik) ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. సభలో దాదాపు 50 వేల మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

బీఆర్​ఎస్​ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున భారీగా కేసీఆర్(KCR)​ సభకు వచ్చేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాన్నామని సైదిరెడ్డి తెలిపారు. ఈ సభకు సుమారు 80 వేల నుంచి లక్ష మంది వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశాం. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండటంతో అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుపు ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

CM KCR Public Meeting Arrangements in Husnabad : హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు శరవేగంగా పనులు.. పరిశీలించిన ఎమ్మెల్యే

CM KCR Meeting with Gajwel Constituency BRS Leaders : 'హ్యాట్రిక్ కొడుతున్నాం.. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతా'

ABOUT THE AUTHOR

...view details