కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా, మూసీ పవిత్ర సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన జరిపారు. శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు.
కార్తిక పుణ్య స్నానాలు, శివనామ స్మరణతో శైవక్షేత్రాలు - నల్గొండ జిల్లాలో కార్తిక పౌర్ణమి వేడుకలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్గొండ జిల్లాలోని వాడపల్లి కృష్ణా, మూసీ పవిత్ర సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి.
కార్తిక పుణ్య స్నానాలు, శివనామ స్మరణతో శైవక్షేత్రాలు
మిర్యాలగూడలోని పలు దేవాలయాలకు భక్తజనం పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగాయి. కార్తిక దీపాల వెలుగులతో శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి:కార్తికం: వేయి స్తంభాల ఆలయంలో భక్తి పారవశ్యం