తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కిటకిటాడిన 'సోమేశ్వరాలయాలు' - chaya someshwaralayam

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నల్గొండ పట్టణంలోని పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలు శివనామస్మరణతో మారు మోగాయి.

భక్తులతో కిటకిటాడిన 'సోమేశ్వరాలయాలు'

By

Published : Nov 12, 2019, 5:24 PM IST

నల్గొండలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాల్లో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోనేరులో దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయాన్ని జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా దర్శించుకుంటారని... ఆలయ ఛైర్మన్​ గంట్ల అనంత రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

భక్తులతో కిటకిటాడిన 'సోమేశ్వరాలయాలు'

ABOUT THE AUTHOR

...view details