KAPAUL dance video: మునుగోడులో పోటీ చేయడం వల్ల నియోజకవర్గం పేరు ప్రపంచమంతా తెలిసిపోయిందని స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం మేటిచందాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. రెండు వందల దేశాల నేతలు తన ప్రచారాన్ని చూసి ఆశ్చర్య పోతున్నారని పేర్కొన్నారు.
మునుగోడు ప్రచారంలో కేఏపాల్ రూటే వేరు.. - munugode bypoll
KAPAL dance video: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి రేపే చివరి తేదీ కావడంతో నాయకులు అందరూ ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై పోయారు. ప్రధాన పార్టీలు వారు అగ్ర నాయకులతో ప్రచారం చేస్తుంటే.. మునుగోడు స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మాత్రం తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లలో ఉత్సాహం నింపుతున్నారు. డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ తన ఎజెండాని ప్రజలకు వివరిస్తున్నారు.
![మునుగోడు ప్రచారంలో కేఏపాల్ రూటే వేరు.. KAPAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16795431-200-16795431-1667223209355.jpg)
KAPAL
మునుగోడు ఉపఎన్నికలో తెరాస, భాజపాకి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. ఈ ఎన్నికలో తాను భారీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ డీజే పాటలకు ఉత్సహంగా నృత్యాలు చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు.
మునుగోడు ప్రచారంలో కేఏపాల్ రూటే వేరు..
Last Updated : Oct 31, 2022, 10:58 PM IST