రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మిర్యాలగూడ మండల పరిధిలోని 311 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
'కరోనా కాలంలోనూ కల్యాణలక్ష్మీ కోసం రూ.5కోట్లు' - మిర్యాలగూడలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో 311మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

'కరోనా కాలంలోనూ కల్యాణలక్ష్మీ కోసం రూ.5కోట్లు'
కరోనా కష్టకాలంలోనూ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ పథకం కోసం రూ.ఐదు కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు కోరారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు