నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంనందు అడవిదేవులపల్లి మండలానికి చెందిన 13మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు అందజేశారు. అదేవిధంగా మిర్యాలగూడ మండలంలో ప్రమాదవశాత్తు చనిపోయిన నలుగురు తెరాస కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను అందజేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుంది: భాస్కరరావు - ఎమ్మెల్యే భాస్కర్‌రావు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన నలుగురు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజలకు మేలు చేసే పథకాలు ఎన్నో తెచ్చారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి తెరాస పార్టీనే ఇన్సూరెన్స్ కడుతుందని, ప్రమాదవశాత్తు వారు చనిపోతే పార్టీ ఎప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కొత్త చట్టాలకై చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.