తెలంగాణ

telangana

ETV Bharat / state

JOURNALIST RAGHU: జైలు నుంచి బెయిల్​పై విడుదలైన జర్నలిస్టు రఘు - జర్నలిస్టు రఘు తాజా వార్తలు

పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టు రఘు మంగళవారం సాయంత్రం బెయిల్​పై విడుదలయ్యారు. మిర్యాలగూడ అదనపు సెషన్స్ కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది.

raghu
జర్నలిస్టు రఘు

By

Published : Jun 15, 2021, 10:19 PM IST

జర్నలిస్టు రఘు జైలు నుంచి విడుదలయ్యారు. అతనికి మిర్యాలగూడ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రఘు నల్గొండ కారాగారం నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. భాజపా శ్రేణుల నినాదాల నడుమ ఆయన బయటకు వచ్చారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో చోటుచేసుకున్న భూవివాదంలో పోలీసులు కేసు నమోదు చేశారు. రఘు తరఫున న్యాయవాదులు... మిర్యాలగూడ అదనపు సెషన్స్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనలు విన్న కోర్టు... షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:CJI: సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్​... రాజ్​భవన్​లో మొక్క నాటిన జస్టిస్ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details