తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్న స్వర్ణకారులు - స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్న స్వర్ణకారులు

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా కట్టడికి తమ వంతు బాధ్యత వహించాలని నల్గొండ జిల్లాలోని స్వర్ణకారులు నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు జిల్లాలోని జ్యుయలరీ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్నాయి.

Jewelers locked up voluntarily in Nalgonda district
నల్గొండ జిల్లాలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్న స్వర్ణకారులు

By

Published : Jul 18, 2020, 4:52 PM IST

ఒక పక్క కరోనా విజృంభణ.. మరో పక్క పెరిగిన బంగారం ధరలు వెరసి స్వర్ణకారుల బతుకులు వీధి పాలవుతున్నాయి. నల్గొండ జిల్లాలో శుభకార్యాలు ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఆషాడ మాసం, శుభకార్యాలు జరగని సమయంలోనైనా కొంత వరకు పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుందామంటే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక చేసేదేం లేక కనీసం వారం రోజులైనా వ్యాపార సంస్థలు మూసి వేసి కరోనా కట్టడికి తమ వంతు బాధ్యత వహించాలని స్వర్ణకారులు నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు జిల్లాలో ఉన్న అన్ని రకాల వెండి, బంగారం, జ్యుయలరీ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్నాయి. దీంతో జిల్లాలో ఆరువేలకు పైగా ఉన్న వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

కరోనా విజృంభిస్తుండడంతో పాటు బంగారం ధర పెరగడం వల్ల కొనుగోలు దారులు కూడా రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. అందుకే తామే స్వచ్ఛందంగా వారం రోజులపాటు బంద్ నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల లాక్​డౌన్​తో తమ వ్యాపారాలే కాకుండా బతుకులు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని స్వర్ణకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదని... షాపులకు అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరుతున్నారు. అలాగే రుణాలు ఇచ్చి స్వర్ణకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details