నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రచారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వంపై యువత చాలా వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
'చట్టసభల్లో ప్రశ్నించే గొంతును గెలిపించండి' - ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రచారం
నల్గొండలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రచారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
!['చట్టసభల్లో ప్రశ్నించే గొంతును గెలిపించండి' 'చట్టసభల్లో ప్రశ్నించే గొంతును గెలిపించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9377920-279-9377920-1604133793908.jpg)
'చట్టసభల్లో ప్రశ్నించే గొంతును గెలిపించాలి'
ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా సర్కారు కాలం గడుపుతోందని మండిపడ్డారు. పట్టబద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి... చట్టసభల్లో ప్రశ్నించే గొంతు ఉండాలని వివరించారు. ఉద్యోగాల విషయంలో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని.. అడపాదడపా పోలీసు ఉద్యోగాలు తప్పా మరే నోటిఫికేషన్ ప్రకటించలేదని సుధాకర్ పేర్కొన్నారు.