రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకం ద్వారా రాష్ట్ర ఖ్యాతి పెరగడంతోపాటు ఉపాధి కూడా పెరుగుతుందని మంత్రి తెలిపారు.
మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆసక్తికర చర్చ
రాష్ట్రాన్ని పెద్ద టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు, ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
srinivas goud
జలాశయాలు, ఆలయాల టూరిజం అభివృద్ధికి అధిక స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్ వద్ద అభివృద్ధిని వివరిస్తున్న క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు... మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:కారుణ్య నియామకం విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం: కేసీఆర్
Last Updated : Sep 14, 2020, 1:16 PM IST