నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం భాగ్యనగర్ కాలనీకి చెందిన శ్రీ రాములు, దుర్గాభవాని దంపతుల కుమార్తె వైష్ణవి ఫిలిప్పీన్స్లో మూడో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆమెతో పాటు మరికొందరు భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పిన్స్ దేశం నుంచి భారత్కు వచ్చేందుకు ఆమె 19, 20 తేదీల్లో విమానం టికెట్లు బుకింగ్ చేసుకుంది.
'ఫిలిప్పీన్స్ నుంచి మా కూతుర్ని తీసుకురండి' - కరోనా నేపథ్యంలో ఫిలిప్పియన్స్
కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్లో చిక్కుకుపోయిన తమ పిల్లలను తిరిగి భారత్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఫిలిప్పిన్స్ నుంచి భారత్కు వచ్చే విమానాలను అనుమతించాలని కోరుతున్నారు.
'ఫిలిప్పియన్ నుంచి మా పిల్లలను తీసుకురండి'
అయితే భారత ప్రభుత్వం ఫిలిప్పీన్స్ నుంచి విమానాలు అనుమతించకపోవడం వల్ల అక్కడ తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అక్కడి విద్యార్థులకు కనీసం బస్సులు అందుబాటులో లేవని, క్యాంటీన్లు, షాపింగ్ మాళ్లు మూసివేయడం వల్ల కనీస వస్తువులు దొరకక వారు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ పిల్లలను భారత్కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.