నల్గొండ జిల్లా త్రిపురారం, బాబు సాయి పేట, పెద్ద దేవులపల్లి సహకార సంఘాల్లో నేడు పాలక వర్గాలు పాలనా బాధ్యతలు చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాజరయ్యారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక వర్గాలు - ప్రాథమిక సహకార సంఘాలు
నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని మూడు ప్రాథమిక సహకార సంఘాల్లో పాలకవర్గాలు కొలువుతీరాయి. ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక వర్గాలు
మూడు ప్రాథమిక సహకార సంఘాలకు డైరెక్టర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు చొప్పున మొత్తం 12 మంది ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూసుకుంటామని పాలకవర్గాలు రైతులకు హామీ ఇచ్చాయి.
ఇదీ చూడండి:నిర్భయ దోషులకు డెత్ వారెంట్- మార్చి 20న ఉరి అమలు