తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపిక చేసిన గ్రామాల్లో... ఐసీఎంఆర్ నమూనాల సేకరణ - నల్గొండలో ఐసీఎంఆర్ పరీక్షలు

ఎంపిక చేసిన గ్రామాల్లో ఐసీఎంఆర్​ బృందం సీరం నమూనాలు సేకరిస్తోంది. 10 సంవత్సరాలు పైబడిన వారి నుంచి నమూనాలు తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం మొదటి దశ నిర్వహించిన ప్రాంతాల్లోనే... ఇప్పుడు రెండో విడత కొనసాగుతోంది.

icmr-testes-in-nalgonda-district
ఎంపిక చేసిన గ్రామాల్లో... ఐసీఎంఆర్ నమూనాల సేకరణ

By

Published : Aug 27, 2020, 5:01 PM IST

కరోనా తీవ్రత, సామాజిక వ్యాప్తి అంశాలను అధ్యయనం చేసేందుకు సిరో సర్వైలైన్స్‌ పేరిట ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాలో నమూనాలు సేకరించారు. ఐసీఎంఆర్ ప్రతినిధులు ఐదు బృందాలుగా విడిపోయి... తిప్పర్తి, మాడుగులపల్లి, కనగల్​, నల్గొండ, నాంపల్లి, మర్రిగూడ, పెదవూర, గుండ్లపల్లి మండలాల్లో పర్యటిస్తున్నారు.

ఆయా మండలాల్లో ఒక్కో గ్రామానికి 16 కుటుంబాలను ఎంపిక చేసుకుని... 40 మంది నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. 10 సంవత్సరాల పైబడిన వారిని ఇందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం మొదటి దశ నిర్వహించిన ప్రాంతాల్లోనే... ఇప్పుడు రెండో విడత కొనసాగుతోంది.

ఇదీ చూడండి:'ప్లాస్మా దానం చేసిన వారందరికి కృతజ్ఞతలు'

ABOUT THE AUTHOR

...view details