హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించారు.
హుజూర్నగర్ తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి - హుజూర్నగర్ తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి
హుజూర్నగర్ అసెంబ్లీకి తెరాస అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సైదిరెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
![హుజూర్నగర్ తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4509090-494-4509090-1569055089630.jpg)
shanampudi saidireddy