కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి కడతేర్చాడో భర్త. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని దేవత్పల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జక్కల నర్సింహ అలియాస్ గోపాల్, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా మరో కుమార్తె, కుమారుడు ఇంటివద్దే ఉంటూ చదువుకుంటున్నారు.
కట్టుకున్నవాడే కడతేర్చాడు. కారణం అదేనా..? - నాంపల్లి మండలంలోని దేవత్పల్లిలో భార్యన చంపిన భర్త
కొడుకు అప్రయోజకుడిగా తిరుగుతున్నాడని అతడి వెంట కత్తి పట్టుకుని వెంటబడ్డాడు ఓ తండ్రి. మధ్యలో అతని భార్య అడ్డురావటంతో ఆమెని కత్తితో పొడవగా.. ఆమె చనిపోయింది. అయితే వివాహేతర సంబంధాన్ని భార్య ప్రశ్నిస్తుందనే కారణంతోనే ఆమెను హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.
కొన్నేళ్లుగా నర్సింహకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. కొడుకు అప్రయోజకుడిగా మారుతున్నాడన్న కోపంతో నర్సింహ మంగళవారం రాత్రి కత్తి తీసుకుని కుమారుడి వెంటపడ్డాడు. అది గమనించిన భార్య యాదమ్మ అతడిని వారిస్తూ అడ్డుపడగా.. భర్త ఆమెని కత్తితో కడుపులో పొడవడంతో.. ఆమె అక్కడే కుప్పకూలింది. వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !