భార్య, కూతురుపై దాడి చేసిన భర్త తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, భర్త ఇద్దరూ ప్రాణాలు కోల్పొగా ఏడాదిన్నర కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మెగావత్ మధు భార్య అఖిల, కూతురు మిల్కీపై గడ్డపారతో దాడి చేశాడు.
భార్య, కూతురుపై దాడి చేసి భర్త ఆత్మహత్య..? - nalgonda crime today news
భార్యను కిరాతకంగా హత్య చేశాడు.. కుమార్తెపై కూడా దాడి చేశాడు.. కానీ కొన ఊపిరితో బతికింది.. చివరకు తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాలో చోటుచేసుకుంది.
భార్య, కూతురుపై దాడి చేసి భర్త ఆత్మహత్య..?
అనంతరం ఇంట్లోనే తాను ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం