నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి.. కొవిడ్ రెండో దశ లాక్డౌన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తోన్న పేదలకు.. అన్నదానం, నిత్యావసరాలను పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతోన్న 1500 మంది కరోనా బాధితులకు మెడికల్ కిట్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు - లాక్డౌన్ ఇబ్బందులు
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి.. గత కొద్ది రోజులుగా పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతోన్న కరోనా బాధితులకు మెడికల్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
కష్టకాలంలో కరోనా బాధితులకు అండగా నిలవడం హర్షించదగ్గ విషయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో.. తమకు తోచిన సహాయం చేస్తోన్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ