నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు 20 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 5,60,345 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వ, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీ, వరద కాల్వ ద్వారా కలిపి మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 589.60 (గరిష్ఠం 590) అడుగుల వద్ద ఉంది.
కృష్ణమ్మ పరవళ్లు... నాగార్జున సాగర్‌కు భారీ ప్రవాహం - నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా వార్తలు
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ దిగువకు ఉరకలెత్తుతోంది. నాగార్జున సాగర్‌కు ఆరు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జూరాల నుంచి వరద తగ్గినా.. మధ్యలో ఉపనదుల్లో ప్రవాహం పెరిగినందున సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగింది.
కృష్ణమ్మ పరవళ్లు... నాగార్జున సాగర్‌కు భారీ ప్రవాహం
పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి కూడా భారీ వరద వెళ్తోంది. అక్కడి నుంచి సోమవారం సాయంత్రం సమయానికి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. మరోవైపు ఎగువన జూరాలకు వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో అక్కడినుంచి నీటి విడుదల తగ్గింది. శ్రీశైలం వద్ద ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులుగా నమోదయింది. అంతే స్థాయిలో దిగువకు స్పిల్‌వే గేట్లద్వారా విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలో కూడా వరద కొంత పెరిగింది.