తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లగొండపై నిప్పులు కురిపిస్తున్న సూరీడు

నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో పగటి పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

By

Published : May 11, 2019, 3:56 PM IST

నల్లగొండపై నిప్పులు కురిపిస్తున్న సూరీడు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. పగటిపూట 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. గత ఐదు రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లో వడదెబ్బకు 7 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు సేవిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎండపూట బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

నల్లగొండపై నిప్పులు కురిపిస్తున్న సూరీడు

For All Latest Updates

TAGGED:

hotsummer

ABOUT THE AUTHOR

...view details