నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మైనార్టీ సోదరులందరూ తెరాసకే ఓటు వేయాలి: మహమూద్ అలీ - nalgonda district latest news
మైనార్టీల కోసం రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సాగర్ ఉప ఎన్నికలో మైనార్టీ సోదరులందరూ తెరాసకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు.
మైనార్టీల కోసం రాష్ట్రప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మహమూద్ అలీ పేర్కొన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం మహిళలకు అండగా నిలుస్తున్నామన్న ఆయన.. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి వేల మంది పిల్లలకు విద్యనందిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సాగర్ ఉప ఎన్నికలో మైనార్టీ సోదరులందరూ తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: 'స్కూలు పూర్తి ఫీజు ఎలా కట్టాలి.. సీఎం స్పందించాలి'