తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సభ ఆపాలంటూ హౌస్​ మోషన్​.. నిరాకరించిన హైకోర్టు

కరోనా విజృంభిస్తున్న వేళ నాగార్జునసాగర్ అనుముల​లో సీఎం కేసీఆర్​ తలపెట్టిన సభను ఆపాలంటూ కొందరు రైతులు హైకోర్టులో హౌస్​ మోషన్​ పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

high court
హైకోర్టు

By

Published : Apr 13, 2021, 4:58 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార సభ నిర్వహించకుండా ఆపాలన్న పిటిషన్​పై ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ హైకోర్టుకు ఉగాది సెలవు ఉన్నందున.. అత్యవసర అంశంగా పరిగణించి హౌస్​ మోషన్ విచారణ జరపాలని అనుములకు చెందిన రైతులు గోలి సైదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును కోరారు.

రైతుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హౌస్​ మోషన్ అనుమతి నిరాకరించింది. కొవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా ఈ నెల 14న అనుములలో తెరాస భారీ సభకు ఏర్పాట్లను చేస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సాగర్ ప్రచారంలో మంత్రిని నిలదీసిన ప్రైవేట్ టీచర్

ABOUT THE AUTHOR

...view details