తెలంగాణ

telangana

ETV Bharat / state

మూసీకి జలకళ... అన్నదాతల్లో ఆనందం - Heavy Water in Moosi project

మూసీకి చాలా కాలం తర్వాత జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నది నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నిండటం వల్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మూసీకి జలకళ... అన్నదాతల్లో ఆనందం

By

Published : Oct 1, 2019, 1:32 PM IST

హైదరాబాద్​లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644.5 అడుగులకు చేరుకుంది. రెండు గేట్లు ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లో 3000 క్యూసెక్కులు ఉంది.

మూసీకి జలకళ... అన్నదాతల్లో ఆనందం

ABOUT THE AUTHOR

...view details