తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2021, 6:57 PM IST

ETV Bharat / state

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్...

శ్రీశైలం ఘాట్​ రోడ్​ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. ఓ వైపు శ్రీశైలం డ్యాం అందాలు.. మరో వైపు మలన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల ఘాట్​ రోడ్​పై భారీగా ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. వాహనాలు కదిలేందుకు గంటల సమయం పడుతోంది.

Srisailam ghat road
Srisailam ghat road

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయం ఘాట్ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఘాట్ రోడ్డుపై వాహనాలు కదిలేందుకు గంటల సమయం పడుతోంది. ఓ వైపు డ్యాం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వెళ్తుండగా.. మరోవైపు నుంచి మల్లన్న దర్శననంతరం.. హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. శ్రీశైలం - హైదరాబాద్ రోడ్డుపైకి అడ్డదిడ్డంగా వాహనాలు రావటంతో ఈ సమస్య ఏర్పడింది.

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులు ఉండగా.. శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.

ఇదీచూడండి:NSP: శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details