గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు అలుగు పోస్తుండటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పంటలు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులను మరమ్మత్తు చేయాలని ప్రజలను అధికారులను వేడుకుంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల కళకళ
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. పలు చోట్ల పంటలు నీటమునిగి పోయాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల కళకళ
కనగల్ మండలంలోని కత్వా, తిప్పర్తి మండలంలోని వెంకటాద్రి పాలెం, కాశివారిగూడెం, నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామాల్లోని చెరువులు భారీ ఎత్తున అలుగు పోస్తున్నాయి.
జిల్లాలోని పలు గ్రామాల్లో పత్తి, కంది, వరి పంటలు నీటిలో మునిగినా... ఇప్పటి వరకు అధికారులు ఇటు వచ్చి చూసిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికారులు వచ్చి నష్టాన్ని పరిశీలించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.