ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది. నాగార్జునసాగర్‌కు భారీఎత్తున వరద వచ్చిచేరుతుండడం వల్ల 14 క్రస్టుగేట్లు 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో 2లక్షలా 47వేల 700 క్యూసెక్కులు వచ్చిచేరుతుండగా... అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు - నాగార్జునసాగర్ గేట్లు ఎత్తిన అధికారులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది. నాగార్జునసాగర్‌కు భారీఎత్తున వరద వచ్చిచేరుతుండడం వల్ల 14 క్రస్టుగేట్లు 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8803174-395-8803174-1600123805013.jpg)
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు
నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311.80 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వచ్చే వరదలో హెచ్చుతగ్గులను బట్టి అధికారులు సాగర్ క్రస్ట్‌గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నారు.