వారంరోజుల పాటు విరామం ఇచ్చిన వరుణుడు మళ్ళీ ముసురేశాడు. గత రెండు రోజులుగా.. కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలకొరిగింది. వానలు ఇలాగే కొనసాగితే.. పత్తి పంట కూడా చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు - భారీ వర్షానికి నిలిచిపోయిన రాకపోకలు
శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. వానలు ఇలాగే కొనసాగితే.. పత్తిపంట చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు
అయితే.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడం వల్ల భూగర్భ జలాలకు కొదువ లేదని కొంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, బావులు, బోర్లు నిండి.. యాసంగి పంటకు నీటి కరువే లేదని రైతులు సంతోషపడుతున్నారు.
ఇదీ చూడండి :'ఓట్లపై ఉన్న ప్రేమ.. హామీల విషయంలో లేదు'