తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండను ఊపేసిన భారీ వర్షం - rains

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది.  మార్కెట్​ యార్డులలో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిగిల్చింది.

ఉమ్మడి నల్గొండలో భారీ వర్షం

By

Published : Apr 8, 2019, 8:22 AM IST

మండు వేసవిలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అప్పరెడ్డిపల్లిలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పలు మార్కెట్​ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్​, కనగల్​ తదితర మండలాల్లో వర్షం అధికంగా ఉంది.

ఉమ్మడి నల్గొండలో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details