బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు మండలాల్లోని చెట్లు విరిగి రోడ్లపై అడ్డంగా పడటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షం.. తడిసిముద్దైన ధాన్యం - నల్గొండలో ఎడితెరపిలేని వర్షం
నల్గొండ జిల్లాలో సోమవారం నుంచి ఎడతెరపిలేకుండా భారీగా కురుస్తుంది. ప్రధాన రహదారులన్నీ జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల వల్ల పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.
ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షం.. తడిసిముద్దైన ధాన్యం
భారీ వర్షాల కారణంగా పత్తి, వరి మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల పంట తడిసి ముద్దవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు వెంటనే కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్