మరో అడుగు దూరం.. నిండు కుండలా నాగార్జున సాగర్
07:27 August 23
మరో అడుగు దూరం.. నిండుకుండలా నాగార్జున సాగర్
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 3,70,958 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నిండుకుండలా మారటం వల్ల అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి.. స్పిల్ వే నుంచి 3 లక్షల 37 వేల క్యూసెక్కుల వరద నీటిని పులిచింతలకు వదులుతున్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు సాగుకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్ తాగు నీటి కోసం ఎస్.ఎల్.బి.సి. నుంచి 18 వందల క్యూసెక్కుల నీరు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 27 వేల క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 587.50 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 305.841 టీఎంసీలుగా ఉంది.
ఇవీ చూడండి: నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల