కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పై నుంచి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,42,378 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,42,378 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు జలాశయం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - etv bharath
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 310.55 టీఎంసీలుగా ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310.55టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 589.50 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం దిగువన ఉన్న ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 28 వేల క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు
Last Updated : Sep 23, 2020, 10:55 AM IST