Munugodu By election BJP Incharge మునుగోడు ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ పదవి కోసం భాజపా నేతల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్, మనోహర్ రెడ్డి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరిని మునుగోడులో అమిత్ షా సభ తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచులను భాజపాలోకి తీసుకువచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ సెంటిమెంట్‌తో జితేందర్ రెడ్డి, గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన అభ్యర్థి, స్థానిక నేత మనోహర్ రెడ్డిని ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా పార్టీకి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరును కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన భాజపా:మునుగోడు బహిరంగ సభకు మండలాలా వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. చౌటుప్పల్ పురపాలిక బాధ్యతలను గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డికి అప్పగించారు. మునుగోడుకు ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డికి బాధ్యతలిచ్చారు.