తెలంగాణ

telangana

ETV Bharat / state

Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెనొప్పి - telangana varthalu

Pranay Murder Case: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెనొప్పి రాగా.. నల్గొండ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెనొప్పి
Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి గుండెనొప్పి

By

Published : Apr 2, 2022, 8:33 AM IST

Pranay Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీకి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అతనికి గుండె నొప్పి రావడంతో నల్గొండ జైలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు నిమ్స్​ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగేనే ఉందని వైద్యులు తెలిపారు.

2018 సెప్టెంబర్‌లో నల్గొండ మిర్యాలగూడలో అమృత భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశారు. హత్య చేసేందుకు అమృత తండ్రి మారుతీరావు అబ్దుల్ బారీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చాడు. నేరం రుజువుకావడంతో అబ్దుల్‌ బారీ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభిస్తున్నాడు. 2020 మార్చిలో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి: వరంగల్ ఎంజీఎం బాధితుడు మృతి.. హనుమకొండకు మృతదేహం తరలింపు

ABOUT THE AUTHOR

...view details