నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం స్థానిక జ్యోతి హాస్పిటల్లో కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చింది. కాగా దవాఖానా యాజమాన్యం ఫ్లై ఓవర్ వద్ద ఉన్న అతిథి రెసిడెన్సీలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే దాని వల్ల తమకు వ్యాధి సోకుతుందనే భయంతో ఐసోలేషన్ కేంద్రాన్ని అక్కడి నుంచి తీసివేయాలంటూ స్థానికంగా ఉండే ప్రజలు ఆందోళనకు దిగారు.
'హనుమాన్‌పేటలోని ఐసోలేషన్ కేంద్రాన్ని తీసేయండి'
స్థానికంగా ఏర్పాటు చేసిన ఐసోలాషన్ కేంద్రాన్ని తీసివేయాలంటూ నల్గొండ జిల్లా హనుమాన్‌పేట ప్రజలు ధర్నాకు దిగారు. దాని వల్ల తమకు కరోనా వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
'హనుమాన్‌పేటలోని ఐసోలేషన్ కేంద్రాన్ని తీసేయండి'
వంద పడకలు ఉన్న మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ని ఉపయోగించుకోకుండా, కరోనా పరీక్షలు నిలిపివేసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కొవిడ్ వైద్యానికి అనుమతి ఇవ్వడం బాధాకరమని వారు ఆరోపించారు. తక్షణమే ఐసోలేషన్ కేంద్రాన్ని అక్కడి నుంచి తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. లేదా ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు