తెలంగాణ

telangana

ETV Bharat / state

చండూరులో 49వ రోజుకు చేరిన నేతన్నల రిలే నిరాహార దీక్షలు - weavers

చండూరులో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 49వ రోజుకు చేరుకున్నాయి. కరోనాతో రోడ్డున పడిన నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు.

handloom workers relay hunger strike reaches to 49th day at Chandur in nalgonda district
చండూరులో 49వ రోజుకు చేరిన నేతన్నల రిలే నిరాహార దీక్షలు

By

Published : Aug 30, 2020, 4:30 PM IST

కరోనా చేనేత కార్మికులను రోడ్డున పడేసింది. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో నేతన్నలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 49వ రోజుకు చేరుకున్నాయి. నేడు పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో గల వాటర్​ ట్యాంక్​ ఎక్కి చేనేత కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడం వల్ల నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details