తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతన్నల సమస్యలను వెంటనే పరిష్కరించండి: రాపోలు - latest news of nalgonda

నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో చేనేత కార్మికులు శాంతియుతంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ నేతన్నలు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్​ భాస్కర్​ ర్యాలీలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

Hand loom workers protest in nalgonda
నేతన్నల సమస్యలను వెంటనే పరిష్కరించండి: మాజీ ఎంపీ రాపోలు

By

Published : Jul 16, 2020, 2:50 PM IST

నల్గొండ జిల్లా చండూరులో చేనేత కార్మికుల శాంతియుత నిరసను పోలీసులు భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. దీనికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ హాజరై మద్ధతు తెలిపారు. నాలుగు నెలలుగా కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయి.. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

వారి గోడును ప్రభుత్వానికి తెలియజేసేందుకు శాంతియుతంగా చేపట్టిన రిలే నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడం సమంజసంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నేత కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details