'ప్రజలకు జానారెడ్డిపై అభిమానముంది... కాంగ్రెస్ గెలుపు ఖాయం' - నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం
నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా... పలువురు తెరాస నేతలు జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. జానారెడ్డిపై ప్రజల్లో అభిమానముందని... కాంగ్రెస్ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
!['ప్రజలకు జానారెడ్డిపై అభిమానముంది... కాంగ్రెస్ గెలుపు ఖాయం' haliya trs leaders joined in congress party](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11238479-663-11238479-1617270186941.jpg)
haliya trs leaders joined in congress party
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డుకు చెందిన పలువురు తెరాస నాయకులు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి జానారెడ్డి... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనేక సేవలు చేశారని.. నేతలు గుర్తుచేశారు. ప్రజలకు జానారెడ్డిపై అభిమానం ఉందని... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో జానారెడ్డిని గెలిపించాలని కోరారు.