ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్(25), పాశం తరుణ్రెడ్డి గల్లంతయ్యారు. ఏడుగురు మిత్రులతో కలిసి వీరు హైదరాబాద్ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జరిగిన లాంచి ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియక.. బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా వీరిద్దరి ఆచూకీ అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
'మా పిల్లల ఆచూకీ తొందరగా తెలపండి' - 'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'
నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఇద్దరు పోలీసు ఉద్యోగులు ఆదివారం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ వీలైనంత త్వరలో అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'