హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత విచారణ ప్రారంభించిన కోర్టు... మనీషా కేసులో 44 మంది, శ్రావణి కేసులో 28, కల్పన కేసులో 29, మొత్తంగా 101 మంది సాక్షులు ఉండగా... ఇవాళ కేవలం మనీషా కేసు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. జనవరి 3న జరిగే విచారణలో మిగిలిన ఇద్దరి కేసుల్లో వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సమీపంలోని స్థానికుల వాంగ్మూలాలతోపాటు... పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేర్కొన్న సారాంశాల్ని శ్రీనివాస్ రెడ్డికి వినిపించారు. శరీర ఆనవాళ్లు లభ్యమైన బావులకు సంబంధించిన యజమానులు, శ్రీనివాస్ రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేసిన సమయంలో నమోదైన హత్య కేసుల వివరాల్ని తెలిపారు.