Gutha Sukendar Reddy On Congress Party Leaders : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. పాదయాత్రల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేసి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పాదయాత్రలు, ప్రభుత్వాన్ని తిట్టిపోసే యాత్రలు జరుగుతున్నాయన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు పాదయాత్రలు చేసి అలసిపోయారని.. ఇక ఇప్పుడు బట్టి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ల పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ క్రమంలోనే భట్టి పాదయాత్ర చేస్తూ నడుస్తున్న రోడ్లన్నీ డబుల్ అయినవి కేసీఆర్ నాయకత్వంలోనే అన్నారు. బట్టి పాదయాత్ర సందర్భంగా జిల్లాలో ఎలాంటి అభివృద్ది జరగలేనన్న మాటకు స్పందించిన గుత్తా.. డిండి ప్రాంతంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని.. అది కనపడటం లేదా అని ప్రశ్నించారు.
Gutha Sukendar Reddy Latest News : భట్టి పాదయాత్ర చేస్తున్న రోడ్లన్నీ కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగాయన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎన్నో సాంకేతిక సమస్యలతో నాలుగేళ్లుగా శ్రీశైలం నీటితో నిండుతుందన్నారు. టన్నెల్ మరమ్మతులకు గురైతే.. ఆరు నెలలు ఆగాల్సి ఉందని.. టన్నెల్ ఇంకా 9 కి.మీ మిగిలి ఉందని గుర్తు చేశారు. డిండి ఎత్తిపోతల పథకాల్లోని ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయని.. ఇప్పటికే రూ.రెండు వేల కోట్లకు పైగా ఖర్చయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలువలు తవ్వి వదిలి పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసి నీళ్లు ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని భట్టి ఇంటికి కూడా నీళ్లు వచ్చాయనేది మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. భట్టికి మధిర నియోజకవర్గం తప్ప ఏదీ తెలియదని.. రాజశేఖర్‌రెడ్డి లాగా పంచ కట్టడం తప్ప అని ఎద్దేవా చేశారు.