తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉంది' - ఎమ్మెల్సీఅభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం

తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. తెరాస నేతలు గిరిజనుల భూమిని కబ్జా చేసి... వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

gujjula-premender-reddy-a-graduate-mlc-candidate-said-the-bjp-had-the-power-to-defeat-trs
'తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉంది'

By

Published : Feb 7, 2021, 11:23 AM IST

తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో సీఏం కేసీఆర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెట్టినంత మాత్రన మళ్లీ ప్రజలు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తే కేంద్రం మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా కేెంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు, 100 పడకల ఆసుపత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్​ ఎందుకు నెరవేర్చలేదని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు. తెరాసలో అందరూ అవినీతి పరులేనని విమర్శించారు. తెరాస ఎమ్మెల్యే గిరిజనుల భూమిని కబ్జా చేసి... వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:మరో ఉద్యమానికి టికాయత్​ పిలుపు

ABOUT THE AUTHOR

...view details