తెలంగాణ

telangana

ETV Bharat / state

పొంగుతున్న భూగర్భ గంగ... రైతు మోములో సిరుల పంట - తెలంగాణ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవడం వల్ల చెరువులు, బావులు, కుండలు జలకలను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయి. పంటలకు సరిపడా నీళ్లు ఉండడం వల్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా భూగర్భ జలాలు సగటున నాలుగు మీటర్ల మేర పెరిగాయి.

పొంగుతున్న భూగర్భ గంగ... రైతు మోములో సిరుల పంట
పొంగుతున్న భూగర్భ గంగ... రైతు మోములో సిరుల పంట

By

Published : Dec 11, 2020, 6:41 PM IST

ఈ ఏడాది ఉమ్మడి నల్లొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సగటున నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు సంబంధిత శాఖ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధికంగా నమోదయినట్లు తమ నివేదికలో వెల్లడించింది. భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టులతో పాటు ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.

ఈ యాసంగిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుతం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన తాగు, సాగు నీటి వనరైన నాగార్జున సాగర్​కు ఈదశాబ్దంలోనే భారీగా వరద నీరు వచ్చిందని అధికారులు తెలిపారు.

సాధారణంగా కురావాల్సింది.. కురిసింది

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు కురవాల్సిన వర్షాపాతానికి కురిసిన వర్షపాతానికి మధ్య వ్యత్యాసం ఈ విధంగా ఉంది.

జిల్లా కురవాల్సిన వర్షపాతం మి.మి. కురిసినది మి.మి.
నల్గొండ 650.6 662.8
సూర్యాపేట 778.3 960.6
యాదాద్రి 669.1 1040.3

ఆనందంలో అన్నదాతలు

సాగుకు నీళ్లు సంవృద్ధిగా ఉండడం వల్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు లేక బోర్లు అడుగంటిపోయి ఉండేవని... ఈ ఏడాది సంవృద్ధిగా కురిసిన వర్షాలతో ఈ యాసంగి పంటకు సరిపడా నీరు ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:మినీ ట్యాంక్​బండ్​ల నిర్మాణాల్లో జాప్యం​

ABOUT THE AUTHOR

...view details