నల్గొండ జిల్లా మిర్యాలగూడ పెద్దబజార్లో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పేద స్వర్ణకారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 60 మంది పేద స్వర్ణకారులకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను వన్‌టౌన్ సీఐ సదా నాగరాజు అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నందున.. పూట గడవని స్వర్ణకారులకు సంఘం చేయూతనిస్తోంది.
Lock Down effect : లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులకు చేయూత - nalgonda lock down
మాయదారి కరోనా పని చేసుకుంటూ గౌరవంగా బతికే వారిని రోడ్డుపాలు చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలను రోజులపాటు పస్తులు ఉంచుతోంది. ఇలాంటి వారి గోడును అర్థం చేసుకున్న కొందరు దాతలు, సంఘాలు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి. నిత్యావసరాలు అందిస్తూ పూటగడిచేలా సాయం చేస్తున్నాయి.
Lock Down
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఐ నాగరాజు కోరారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండివేలంలో రూ.72లక్షలు పలికిన చేప ధర