నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కర్ణాటక రమేశ్ అతని కుటుంబ సభ్యులు... లక్షా యాభై వేల రూపాయల వ్యయంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొని... ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయించారు.
'నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి' - మిర్యాలగూడలో నిత్యావసరాల పంపిణీ
తను నివాసముండే ప్రాంతాలోని ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడకూడదని ఓ వ్యక్తి నిత్యావసరాలు, కూరగాయలు కొని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
'నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి'
లాక్డౌన్ సమయంలో తన కాలనీలో పేద ప్రజలు ఆకలితో బాధపడవద్దనే ఉద్దేశంతో రమేశ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. మరింత మంది తమ దాతృత్వాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'ఆ రంగంలో 29 లక్షల ఉద్యోగాలు పోతాయ్'