తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor with farmers: 'నేను ఎవరో తెలుసా... మీకోసమే వచ్చా' - Telangana news

Governor with farmers: ఇవాళ నల్గొండ జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ సహిత సంతోషి మాతా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఐకేపీ కేంద్రాలను సందర్శించి అక్కడి రైతులతో ముచ్చటించారు.

Governor
Governor

By

Published : Dec 8, 2021, 4:30 PM IST

Governor with farmers: నల్గొండ జిల్లాలో పర్యటించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్టణంలోని షేర్ బంగ్లాలో శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషి మాతా ఆలయాన్ని పున: ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజ్​భవన్ నుంచి ఉదయం రోడ్డు మార్గంలో నల్గొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌కు విచ్చేశారు. ఎస్పీ రంగనాథ్, జేసీ చంద్ర శేఖర్, ఆర్డీవో జగదీశ్ రెడ్డి పుష్పగుచ్ఛంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కాసేపు ముచ్చటించారు. ఎన్ని ఎకరాల్లో ఎంత పండించారు? ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులు అయింది? నేను ఎవరో తెలుసా అంటూ రైతులతో గవర్నర్ మాట్లాడారు. రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత సీజన్‌లో కంటే ఈసారి ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని రైతులు తెలిపారు. అక్కడి నుంచి తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పులపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

'నేను ఎవరో తెలుసా... మీకోసమే వచ్చా'

ABOUT THE AUTHOR

...view details