తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు: బాల్క సుమన్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు... ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. తెరాస నేతలపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

Government whip Balka Suman speaks on Trs victory
నాగార్జున సాగర్​ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బాల్క సుమన్​, నాగర్జునసాగర్​ ఉప ఎన్నిక ఫలితాలు

By

Published : May 2, 2021, 4:44 PM IST

తెరాస ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో చేసిన అభివృద్ధే జానారెడ్డిని ఓడించిందని... ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అనేక అసత్యపు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా భాజపా నేతలు కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడాలని అన్నారు.

నియోజకవర్గ ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులపై... విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తెరాసకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్నారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

ABOUT THE AUTHOR

...view details