ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.1217 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాలు, కాల్వల మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముక్త్యాల, జాన్ పహాడ్ బ్రాంచ్ కాల్వల కోసం కృష్ణా నదిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో పాటు ఆధునీకరణ, సీసీ లైనింగ్, సాగర్ ఎడమగట్టు కాల్వ సీసీ లైనింగ్ పనులకు అనుమతులు ఇచ్చింది. వెల్లటూర్ దగ్గర రూ. 817 కోట్లతో, గుండెబోయినగూడెం దగ్గర రూ. 118 కోట్లతో ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు.
నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు సర్కారు అనుమతి - Nalgonda lift irrigation schemes updates
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలు, కాల్వల మరమ్మతులకు సర్కారు అనుమతిచ్చింది. మొత్తం 1217 కోట్లలో 71 లక్షల రూపాయలతో ఆరు పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
government give permission to Nalgonda lift irrigation schemes
ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ఆధునీకరణ, సీసీ లైనింగ్, పునరావాసం కోసం రూ. 184 కోట్లతో అనుమతులు ఇచ్చారు. రూ.52 కోట్లతో జాన్ పహాడ్ బ్రాంచ్ కాల్వకు సీసీ లైనింగ్ చేయనున్నారు. మొత్తం 1217 కోట్లలో 71 లక్షల రూపాయలతో ఆరు పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.